మౌలిక వసతులు కల్పించాలి
సంగారెడ్డి జోన్/పుల్‌కల్(అందోల్): ప్రభుత్వ పాఠశాలలు ,అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోపంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతోపాటు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ, రోడ్లు భవనాలు, రవాణ, ఆర్టీసీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య,పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీడీ, ఆత్మ కార్యాలయంలో నిర్వహించిన ‘డిప్లమో ఇన్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్’కార్యక్రమానికి కలెక్టర్ గురువారం హాజరై ప్రారంభించారు. అనంతరం పుల్‌కల్ మండల పరిధిలోని బస్వాపూర్ శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. యంగ్ ఇండియా పాఠశాల పనులు నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు ఆదేశించారు. పాఠశాల నిర్మాణాలను నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలన్నారు.
భవన నిర్మాణాల జాప్యంపై అసంతృప్తి ఏడాదైనా యంగ్ ఇండియా స్కూల్ భవనాలు పునాదుల స్థాయిలోనే ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సింగూరు, గొంగ్లూర్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. గొంగ్లూర్ పాఠశాలలో మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు పాఠశాలకు ప్రహారీ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని సర్పంచ్ శ్రీనివాస్ కలెక్టర్‌కు తెలిపారు. పాఠశాలకు ప్రహారీ, విద్యార్థులకు మరుగుదొడ్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, డీలర్లు, ట్రైనర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య


