ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను ప్రోత్సహించాలి

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను ప్రోత్సహించాలి

ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను ప్రోత్సహించాలి

రాష్ట్ర శాసనమండలి మాజీ ప్రోటెమ్‌ చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి

రాష్ట్ర శాసనమండలి మాజీ ప్రోటెమ్‌ చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసనమండలి మాజీ ప్రొటెమ్‌ చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని శ్రీగీతా భూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం జరిగిన 18వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో ఇంటర్మీడియెట్‌ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఈవిషయాన్ని నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దృష్టికి తీసుకునిపోయిన వెంటనే జూనియర్‌ కళాశాల మంజూరు చేసి స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ సమయంలో తన సొంత నిధులతోపాటు మిత్రుల సహకారంతో కార్పొరేట్‌ కళాశాలకు దీటుగా ఈ కాలేజీని నిర్మించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పోటీలు పడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా,రంగోళి పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌లు వి.సింధురెడ్డి, అంజయ్య యాదవ్‌, నాయకులు కుమార్‌గౌడ్‌, వి.మల్లారెడ్డి, విష్ణువర్థన్‌ రెడ్డి, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement