
ఉన్నత విద్యతో స్థిరపడాలి
నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరూ ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచిగా స్థిరపడాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకాంక్షించారు. ఖేడ్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు 875మందికి డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్, కెరీర్‌గైడెన్స్ పంపిణీ చేసి ప్రయాణ భద్రత, నారీ శక్తి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఖేడ్ మోడల్ డిగ్రీ కళాశాల ఫస్టియర్ విద్యార్థుల ప్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొని వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆడపిల్లలను తల్లిదండ్రులు డిగ్రీ వరకు తప్పకుండా చదివించాలన్నారు. ఆడపిల్లలకు 21ఏళ్లలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేయకూడదన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోశ్, పంకజ్, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి మాట్లాడుతూ..జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు కష్టించి చదువుకోవాలని కోరారు. రోడ్డు భద్రతను పాటించాలని, నిబంధనలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువులో ఎదురయ్యే ఇబ్బందులు, సందేహాలను అధ్యాపకులను అడిగి నివృతి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ పోశెట్టి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్‌రావు, నాయకులు దారం శంకర్, రమేష్ చౌహాన్, యాదవరెడ్డి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి, ఎంఈవో మన్మథకిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ చైర్మన్ రేణిగ్రేస్ మిత్రబృందం పాఠశాలకు రూ.30వేలు విరాళంతోపాటుగా బాలికలకు ఆరోగ్య సామగ్రిని అందించారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి