
నేడు అందోల్‌కు మీనాక్షి
జోగిపేట(అందోల్): ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం అందోల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ రెండు రోజులుగా జోగిపేటలోనే మకాం వేసి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా, సంగుపేట నుంచి జోగిపేట వరకు మీనాక్షి నటరాజన్ చేపడుతున్న పాదయాత్రకు జనహిత పాదయాత్రగా నామకరణం చేశారు. అందోల్ మండలం సంగుపేట నుంచి జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సంగుపేట వద్ద మీనాక్షి నటరాజన్‌కు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వచ్ఛందంగా పాల్గొనాలి: దామోదర
మీనాక్షి నటరాజన్ చేపట్టే జనహిత పాదయాత్రలో నియోజకవర్గంలోని పార్టీకి ముఖ్యనాయకులు, కా ర్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా హజరై పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని విజయవంతం చే యాలని మంత్రి దామోదర పిలుపునిచ్చారు. ఆగస్టు 2న శ్రమదానంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు లక్ష్మిదేవీ గార్డెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.
సంగుపేట నుంచి జనహిత పాదయాత్ర
తరలిరావాలని దామోదర పిలుపు