
అనుమతులు వేగవంతం చేయండి
పరిశ్రమల ఏర్పాటుపై కలెక్టర్
సంగారెడ్డి జోన్/కంది(సంగారెడ్డి): జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ప్రావీణ్య నిర్వహించిన పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశానికి జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ తుల్జా నాయక్ హాజరయ్యారు. మెటీరియల్స్ సరఫరా, భూ కమతాల మంజూరు, విద్యుత్ కనెక్షన్ల అనుమతుల కోసం దరఖాస్తు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు వెంటనే అనుమతులివ్వాలన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కందిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నవారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కందిలోని జెడ్పీహెచ్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా అందుతున్న బోధనలను పరిశీలించారు. ఈసారి కూడా పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సూచించారు.