చింతకుంట టు ‘చిట్కుల్‌’ | - | Sakshi
Sakshi News home page

చింతకుంట టు ‘చిట్కుల్‌’

Aug 1 2025 1:41 PM | Updated on Aug 1 2025 1:41 PM

చింతకుంట టు ‘చిట్కుల్‌’

చింతకుంట టు ‘చిట్కుల్‌’

● క్యూగట్టిన కల్లు ప్రియులు ● చింతకుంట, పోసానిపేటలలోకల్లు దుకాణాలు మూసివేత ● మొదటిసారిగా నాలుగురోజులుగా బంద్‌ ● అక్రమంగా కల్లు తెచ్చుకుంటున్నాపట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు

వట్‌పల్లి(అందోల్‌): అందోలు మండలం పరిధిలోని చింతకుంట, పోసానిపేట గ్రామాల్లో కల్లు దుకాణాలను మూసేశారు. దీంతో కల్లు ప్రియుల బాధలు వర్ణనాతీతం. కల్లుకు బానిసైన కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌ గ్రా మంలోని కల్లు దుకాణాలకు క్యూగట్టారు. జోగిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన కొంత మంది సభ్యులు తమకు రావాల్సిన వాటా డబ్బులు కాంట్రాక్టర్‌ ఇవ్వలేదన్న ఆరోపణలతో ఎకై ్సజ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, అందోల్‌లోని కల్లు డిపోలో కల్లును తయీరు చేసి రవా ణా చేయకుండా అడ్డుకున్నారు. దీంతో జోగిపేట, పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో కల్లు విక్రయాలు నిలిచిపోయాయి. నాలుగు రోజుల పాటు స్థానికంగా కల్లు విక్రయాలు నిలిచిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా కల్లుకు బానిసై న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఒక్క రోజు కల్లు సేవించనట్లయితే నరాలు పీక్కుపోవడం, అనారోగ్యానికి గురికావడం వంటి ఘటనలు గతంలో జరిగాయి.

దారులన్నీ చిట్కుల్‌వైపే...

స్థానికంగా కల్లు విక్రయాలు నిలిచిపోవడంతో మూడు గ్రామాలకు చెందిన కల్లు ప్రియులు చిట్కుల్‌ గ్రామానికి తరలివెళుతున్నారు. అక్కడ విక్రయించే కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువగా కలపడం వల్ల కూడా స్థానికులు బాగా ఆకర్షితులవుతున్నారు. ప్రతి రోజు జోగిపేటకు చెందిన వారు మహిళలే 5, 10 లీటర్ల ప్లాస్టిక్‌ డబ్బాలలో ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ కావడం కూడా వారికి కలసి వస్తుంది. ప్రభుత్వం లైసెన్స్‌లు కలిగి ఉన్న దుకాణాలు మూసి ఉంచినా ఎకై ్సజ్‌ అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.

చిట్కుల్‌ కల్లు కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

జోగిపేటలో కల్లు అందుబాటులో ఉన్నప్పటికీ మత్తు కు అలవాటు పడిపోయి చిట్కుల్‌కు ప్రతి రోజు ద్విచక్రవాహనాలపై వెళుతున్నారు. అక్కడే కల్లు సేవించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు పది మందికిపైగా మృత్యువాతకు గురైన సంఘటనలున్నాయి. ఈ విషయం స్థానిక ఎకై ్సజ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా అక్రమ కల్లు రవాణాను అడ్డుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement