
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
చేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను చేర్యాల పోలీసులు, సిద్దిపేట టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ శ్రీను కథనం ప్రకారం .. గురువారం ఉదయం చేర్యాల హెచ్‌పీ పెట్రోలు పంపు వెనకాల ఉన్న చెట్లలో గంజాయి విక్రయించేందుకు పలువురు యువకులు ప్రయత్నిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చేర్యాల పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నీల చందు, ఆకుల హర్షవర్ధన్ వద్ద 180 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, వారు హైదరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద విక్రయించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
180 ఎండు గంజాయి, బైకు స్వాధీనం