సంగారెడ్డి జోన్: ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజమేనని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, ఎస్సై యాదవ్‌రెడ్డి, అలీముద్దీన్, ఏఎస్సై అజీముద్దీన్ పదవీ విరమణను పురస్కరించుకుని గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. విరమణ పొందిన అధికారులను పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివన్నారు. పదవీ విరమణ అనంతరం వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా చూస్తామన్నారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని తెలిపారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. వర్టికల్ డీఎస్పీ శ్రీనివాసరావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, ఎఆర్ డీఎస్పీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్