
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు.
ఇంటి నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్‌ఐ వెంకటేశం కథనం ప్రకారం... మండలంలోని బీబీపేటకు చెందిన కుమ్మరి సునీత ఈ నెల 12న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఆమె ఆచుకీ లభించలేదు. భర్త కుమ్మరి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కూలీ పనికి వెళ్లిన మహిళ..
శివ్వంపేట(నర్సాపూర్): మహిళ అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్ర శ్యామల శనివారం ఉదయం ఇంట్లో నుంచి కూలి పనికి వెళ్లి సాయత్రం వరకు ఇంటికి రాలేదు. భర్త సత్తయ్య తన విధులు ముగించుకొని ఇంటికి రాగా భార్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా భార్య ఆచూకీ లభించలేదు. దీంతో భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం