హత్య చేసి.. ఆపై తగులబెట్టి.. | - | Sakshi
Sakshi News home page

హత్య చేసి.. ఆపై తగులబెట్టి..

Feb 9 2024 6:14 AM | Updated on Feb 9 2024 4:37 PM

- - Sakshi

సంగారెడ్డి: మహిళను దారుణంగా హత్య చేసి అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టిన ఘటన హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రం సమీపంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సుభాష్‌ కథనం ప్రకారం.. రత్నూరు మండలం గోవిందరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే సునీత (45)కు హత్నూర మండలం మధుర గ్రామానికి చెందిన మాదిగ దత్తయ్యతో రెండు నెలల కిందట పరిచయం ఏర్పడింది. వీరు రెండు, మూడు సార్లు మధుర శివారు దత్తాచల క్షేత్రం గుట్టల్లో కలుసుకున్నారు.

కలిసిన ప్రతీ సారీ దత్తయ్య రూ.500, రూ.1,000 సునీతకు ఇచ్చేవాడు. డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్‌ చేయడంతో విసిగిపోయిన దత్తయ్య గత నెల 31వ తేదీన మద్యం మత్తులో సునీత తలపై బండ రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. సునీత కోసం కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈనెల 2వ తేదీన హత్నూర పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వివాహేతర సంబంధంతో డబ్బు ఎక్కువ అడగడం వల్లే హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement