మహేశ్వరం: పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి జి.మురళీ మనోహర్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం మండల పరిధిలోని కేసీ తండా సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ పార్కులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఆందో ళన చెందకుండా వెంటనే 101 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై కంపెనీ యజమానులు, కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు అవగాహన కల్పించారు.


