శంకర్‌పల్లి: ప్రభుత్వం అప్పగించిన పనిని సిబ్బంది నిబద్ధతతో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని శంకర్‌పల్లి డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిఽషత్ కార్యాలయంలో శనివారం జనగణనకు సంబంధించి ఉపాధ్యాయులకు మొదటి విడత శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేటర్స్, సూపర్‌వైజర్లు తమకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయాలని, గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సేవకుల సాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ కరుణాకర్ రెడ్డి, మహేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.


