బడంగ్‌పేట్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నిండుకుండ అనురాధ(33) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. భర్త శ్రీనుతో కలిసి ఆర్‌ఎన్‌రెడ్డి నగర్ ద్వారకామయికాలనీలో మూడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఉదయం రూమ్ నుంచి వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానంతో కిచెన్ కిటికి నుంచి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులకు ఇంటి ఓనర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం
తప్పిన ప్రాణనష్టం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
ఆల్విన్‌కాలనీ: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ కూతవేటు దూరంలో మెట్రో పిల్లర్ నెంబర్ 734 వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దుర్గా మల్లేశ్వరి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో బస్సులోని 18 మంది ప్రయాణికులు వెంటనే ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి దూకారు. ఏపీలోని పాలకొల్లు వెళ్లాల్సిన ఈ బస్సు కొండాపూర్ నుంచి మియాపూర్ మీదుగా కేపీహెచ్‌బీ చేరుకుంది. బస్సు ఆగి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. అయితే తనిఖీ చేసిన రిపోర్టు ఉంటేనే బస్సులను అనుమతించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
పెళ్లిపేరిట సహచర
కానిస్టేబుల్ మోసం
బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విష యం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్‌లోని తన గదిలో స్వప్నిల్‌తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్ర లు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


