ఇబ్రహీంపట్నం రూరల్: మైనర్లకు గుట్కా, మసాల లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆదిబట్ల పోలీసులు హెచ్చరించారు. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఏక కాలంలో ఏడు చోట్ల పోలీసులు పాన్ షాపులపై దాడులు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి షాపుల్లో తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా విక్రయించే మత్తు పదార్థాలను, గుట్కా, పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు విద్యార్థులకు అలవాటుగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే వారికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో కఠినమైన నిబంధనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సత్యనారాయణ, వెంకటేశ్, నోయల్‌రాజు, వెంకటేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’తో సోదాలు
పహాడీషరీఫ్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ ఆదేశాల మేరకు బాలాపూర్ పోలీసులు విద్యా సంస్థల పరిసరాలలోని కిరాణ దుకాణాలు, పాన్ షాప్‌లలో శనివారం సోదాలు నిర్వహించారు. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలతో విద్యార్థుల మత్తు పదార్థాలకు బానిసలవుతున్న దృష్ట్యా పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా షాహిన్‌నగర్, ఎర్రకుంట, కొత్తపేట, బా లాపూర్, మల్లాపూర్, సుల్తాన్‌పూర్ తదితర ప్రాంతాల లోని పాఠశాలల సమీపంలోని షాప్‌లలో తనిఖీలు చే పట్టారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ సుధాకర్ మాట్లాడు తూ.. పాఠశాలల పక్కనే ఉన్న పాన్ షాప్‌లలో విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్న విద్యార్థులు క్రమేణా సిగరేట్, గంజాయి లాంటి వాటికి బానిసలవుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు విక్రయించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఏడు చోట్ల తనిఖీలు


