ఇటు రసాభాస! | - | Sakshi
Sakshi News home page

ఇటు రసాభాస!

Jun 20 2025 6:49 AM | Updated on Jun 20 2025 6:49 AM

ఇటు ర

ఇటు రసాభాస!

ఇద్దరికి గాయాలు టిప్పర్‌ , బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఇన్ముల్‌నర్వ లో చోటు చేసుకుంది.
కర్షకుల ఖాతాల్లో పంట సాయం జమ
● మాకెందుకు రాలేదంటూ ఔటర్‌ సమీప రైతుల ఆందోళన ● బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మద్దతు
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఓ వైపు తమ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తుండగా.. ఔటర్‌ సమీపంలోని మండలాల రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు పంట సాయం అందలేదని మండిపడుతున్నారు. వీరికి ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలపడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

10లోu

అటు

భరోసా

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వానాకాలం పంట సాయం కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. రైతు భరోసా పేరుతో అర్హులైన అకౌంట్లలో డబ్బులు వేస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయగా, రెండో రోజు మూడు ఎకరాలు, నాలుగో రోజు నాలుగు ఎకరాలు, ఐదో రోజు ఐదెకరాలోపు భూములు ఉన్న వారికి నగదు పంపిణీ చేసింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా అర్బన్‌ మండలాల రైతులు మాత్రం నిరాశకు గురయ్యారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్న మెజార్టీ పొలాలు వ్యవసాయేతర భూములుగా మారడం, ఖాళీ భూముల్లోనూ పంటలు లేకపోవడం, మార్కెట్లో వీటికి మంచి ధర లభిస్తుండటంతో ప్రభుత్వం ఆయా మండలాల్లోని రైతులకు గత యాసంగి నుంచే ఈ పథకం అమలును నిలిపివేసింది. ఇతర రైతులకు మాత్రం ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. ఈ నగదును వానాకాలం పెట్టుబడుల కోసం వినియోగించాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.

అందరికీ ఇవ్వండి

అబ్దుల్లాపూర్‌మెట్‌: జిల్లాలోని మెజార్టీ రైతులకు భరోసా పథకం అందలేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. పంటల సాగు కోసం తక్షణమే రైతుల ఖాతాల్లో నగదు చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్‌, సహకార సంఘం మాజీ చైర్మన్‌ లెక్కల విఠల్‌రెడ్డి, కోటా వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

న్యూస్‌రీల్‌

రంగారెడ్డిలో చెల్లింపులు ఇలా..

తేదీ విస్తీర్ణం రైతులు ఖాతాల్లో నగదు జమ

16 2 ఎకరాలు 1,54,622 రూ.81,34,19,493

17 3 ఎకరాలు 1,87,435 రూ.12,78,89,726

18 4 ఎకరాలు 2,06,736 రూ.165,95,67,080

19 5 ఎకరాలు 2,19,938 రూ.199,35,21,916

వికారాబాద్‌లో

తేదీ విస్తీర్ణం రైతులు ఖాతాల్లో నగదు జమ

16 2 ఎకరాలు 1,62,596 రూ.98,99,42,656

17 3 ఎకరాలు 2,05,637 రూ.163,74,49,371

18 4 ఎకరాలు 2,30,844 రూ.216,60,10,315

19 5 ఎకరాలు 2,48,374 రూ.264,21,56,042

ఇటు రసాభాస!1
1/3

ఇటు రసాభాస!

ఇటు రసాభాస!2
2/3

ఇటు రసాభాస!

ఇటు రసాభాస!3
3/3

ఇటు రసాభాస!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement