చేవెళ్ల: లేడీస్ టైలర్ వద్దకు వెళ్తున్నానని రెండేళ్ల కుమారుడితో వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని ముడిమ్యాలలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఎంజాల కామిని(24), మహేందర్ దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు సంతానం. గురువారం బ్లౌజ్ కుట్టించుకుంటానని కుమారుడితో కలిసి వెళ్లిన కామిని రాత్రయినా తిరిగి రాలేదు. వారి కోసం మహేందర్ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన శుక్రవారం చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.