జనరల్‌కు జై
మున్సి‘పోల్స్’కు రిజర్వేషన్లు ఖరారు జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు చైర్మన్ స్థానాలు జనరల్‌కు ఐదు, ఎస్సీలకు ఒకటి, బీసీలకు ఒకటి వార్డులకు లాటరీ పద్ధతిలో ఎంపిక అతివలను వరించిన అదృష్టం..సగం సీట్లు వారికే.. ఆశావహుల అంచనాలు తలకిందులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల కమిషన్ మున్సిపల్ చైర్మన్/ వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం మున్సిపల్, కార్పొరేషన్ల చైర్మన్/ మేయర్ పోస్టులకు గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీల సమక్షంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రిజర్వేషన్లు ఖరారు చేయగా, ఆయా మున్సిపాలిటీల్లోని వార్డులకు జిల్లా ఎన్నికల అధికారులు లాట రీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా పరిధిలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా వీటిలో ఐదు జనరల్‌కు, ఎస్సీలు, బీసీలకు ఒక్కోటి చొప్పున రిజర్వ్ అయ్యాయి. శంకర్‌పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ఆమనగల్లు మున్సిపాలిటీలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. మొయినాబాద్ ఎస్సీ జనరల్‌కు, షాద్‌నగర్ బీసీ జనరల్‌కు దక్కింది.
వార్డు స్థానాలకు ఇలా..
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లు మున్సిపల్ పరిధిలో 15 వార్డులు, చేవెళ్ల పరిధిలో 18, ఇబ్రహీంపట్నం పరిధిలో 24, మొయినాబాద్ పరిధిలో 26, షాద్‌నగర్ పరిధిలో 28, శంకర్‌పల్లి పరిధిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ, బీసీ మహిళ, అన్ రిజర్వ్‌డు మహిళలకు 62 స్థానాలు దక్కడం విశేషం. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మో హన్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆమనగల్లులో ఏడు, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7 వార్డుల చొప్పున మహిళలకు కేటాయించినట్లు ప్రకటించారు. కార్యక్రమానికి రాజకీయ పార్టీల నుంచి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు (సీపీఐ), బోడ సామెల్, సీహెచ్ ఎల్లేష్ (సీపీఎం), చల్లా నర్సింహా రెడ్డి, బండారి ఆగిరెడ్డి, జంగారెడ్డి (కాంగ్రెస్), మదుపు వేణుగోపాల్, నిట్టూ జగదీశ్వర్, వెంకట్ రెడ్డి(బీఆర్‌ఎస్), విజయ్ కుమార్, దేవేందర్ రెడ్డి, కొండా మధుకర్ రెడ్డి (బీజేపీ) హాజరయ్యారు. వీరితో పాటు మెప్మా పీడీ వెంకటనారాయణ, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఎస్.వెంకటేశ్, ఎ.యోగేశ్, వి.సునీత, బి.స త్యనారాయణ రెడ్డి, ఎం.శంకర్, ఎండీ మొయినొద్దీన్ హాజరయ్యారు.
ఆశావహులకు భంగపాటు
ఇదిలా ఉంటే చైర్మన్, మేయర్ సహా కార్పొరేటర్ స్థానాలను ఆశించిన ఆశావహులకు భంగపాటు తప్పలేదు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న వాళ్లు.. ఆశించిన దానికి భిన్నంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఖంగు తినాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలు/ఆశావహుల అంచనాలకు తలకిందులు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలను వెతికి బరిలో నిలిపే పనిలో నిమగ్నమయ్యాయి.
వీడిన ఉత్కంఠ


