
భయపెడుతున్న గ్రామ సింహాలు
ఆమనగల్లు: ‘ప్రతి వీధిలో కుక్కలు గంపులుగా తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎటునుంచి ఎవరిపై దాడికి పాల్పడతాయో.. ఏ హానీ తలపెడతాయో భయంగా ఉంది. వాటి బారి నుంచి ప్రజలను కాపాడండి‘ అని మునిసిపల్ కమిషనర్ వసంతకు హిందూదళం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆమనగల్లు పట్టణంలో శునకాల బెడద ఎక్కువయిందని తెలిపారు. రోడ్డుపై వెళ్లేవారిని వెంబడిస్తూ ఎగబడుతున్నాయని చెప్పా రు. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అయినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో దళం సభ్యులు టిల్లు యాదవ్, పాతకోట శ్రీశైలం, కుమార్‌గౌడ్, నరేశ్ తదితరులు ఉన్నారు.
నియంత్రణకు చర్యలు తీసుకోండి
కమిషనర్ వసంతకుహిందూదళం సభ్యుల వినతి

భయపెడుతున్న గ్రామ సింహాలు

భయపెడుతున్న గ్రామ సింహాలు