
బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
చేవెళ్ల: బీసీల హక్కులు, 42శాతం రిజర్వేషన్ సాధనకోసం బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో చేవెళ్ల మండల బీసీ సంక్షేమ సంఘం మండల కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి స్థానంలో బీసీలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. బీసీల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. చేవెళ్ల మండల బీసీ సంక్షేమ శాఖ నూతన అధ్యక్షుడిగా కమ్మెట గ్రామానికి చెందిన శేఖర్‌గౌడ్, ఉపాధ్యాక్షుడిగా మల్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్‌ను నియమించి నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటయ్య, శంకర్‌పల్లి మండల అద్యక్షుడు వెంకటేశ్‌ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి
అండగా నిలబడాలి
షాద్‌నగర్‌రూరల్: బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలబడాలని తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి అధికారి ప్రతినిధి శ్రీధర్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ పోరాట సమితి సమావేశానికి షాద్‌నగర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజ్ కులస్తులను ప్రభుత్వం బీసీ–డి నుండి బీసీ – ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో ముదిరాజ్‌లు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కొండె యాదయ్య, అంజయ్య, మానపాటి ప్రదీప్, వేణుగోపాల్, శ్రీనివాస్, మహేష్, రంజిత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు
నందిగామ: శుభకార్యానికి బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (30), శిరీష దంపతులు. ఆదివారం రాత్రి బైక్‌పై మండల పరిధిలోని నర్సప్పగూడలో జరిగే ఓ శుభకార్యానికి బయలు దేరారు. నందిగామలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చౌరస్తా వద్ద నర్సప్పగూడకు మళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సింబయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీ వైపు నుంచి వస్తు న్న కారు ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రహదారి పక్కన ఆగిఉన్న డీసీఎం వాహనాన్ని సైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తు న్న విజయ్ కుమార్ మృతి చెందగా, శిరీష తీ వ్రంగా గాయపడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చంద్రకల్ వాసికి డాక్టరేట్
దౌల్తాబాద్: మండల పరిధిలోని చంద్రకల్ గ్రా మానికి చెందిన దేవయ్య, శకుంతల కుమార్తె సరిత ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో ఆదివారం డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో నేల నాణ్యత పెరుగుదలపై అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశ్రీ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినట్లు వివరించారు. డాక్టరేట్ పొందిన సందర్భంగా సరితను కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి