మొయినాబాద్: డ్రగ్స్ వినియోగిస్తూ బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న ఫాంహౌస్‌పై ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులను పట్టుకుని వారు వినియోగిస్తున్న డ్రగ్స్, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి ఫాంహౌస్‌లో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. చేవెళ్ల ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఉండే ఐటీ ఉద్యోగి అభిజిత్ తన బర్త్ డే పార్టీ నిర్వహించేందుకు మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి రెవెన్యూలో ఉన్న సీరినే ఓర్చర్డ్స్ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు. శనివారం రాత్రి అభిజిత్‌తోపాటు మరో ఏడుగురు ఐటీ ఉద్యోగులు ఫాంహౌస్‌కు వచ్చారు. బర్త్‌డే పార్టీలో భాగంగా డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. అభిజిత్‌తోపాటు సింప్‌సన్, పార్తు, గోయల్, యశ్వంత్, సేవియో డెన్నిస్‌ను పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువ చేసే ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, హష్ ఆయిల్ డ్రగ్స్, ఐదు విదేశీ మద్యం బాటిళ్లు, మూడు లగ్జరీ కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ఐటీ ఉద్యోగులు పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బర్త్ డే పార్టీలో వినియోగించిన ఐటీ ఉద్యోగులు
దాడి చేసిన ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు
పట్టుబడిన ఆరుగురు.. పరారీలో మరో ఇద్దరు
డ్రగ్స్, విదేశీ మద్యం స్వాధీనం