
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పీజీ నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పరీక్షకు ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ, శ్రీఇందు, ఏవీఎన్, శ్రీఇందు, గురునానక్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్‌పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కోసం 110 మందిని కేటాయించారు. పరీక్ష సమయానికి ముందుగానే చేరుకున్న గాంధీ మెడికల్ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్ నితిన్ పొరపాటున ప్రొవిజనల్ సర్టిఫికెట్ మర్చిపోయాడు. పరీక్ష సమ యం దగ్గరపడుతుండడం.. సమీపంలో ఎక్కడా జి రాక్స్ కేంద్రాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి తనకారు ఇచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు పంపించి ప్రొవిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో నితిన్, ఆయన తల్లిదండ్రులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.