
ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
శంకర్‌పల్లి: హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. మండలంలోని గోపులారంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్ గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన పోరాటాలకు సంబంధించిన చరిత్రను చదివి స్ఫూర్తి పొందాలన్నారు. రాజ్‌భూపాల్‌గౌడ్ మాట్లాడుతూ.. యువత అన్ని మతాల వారిని గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట వీరధర్మాజ స్వామి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మండలాధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాములు, వాసుదేవ్ కన్నా, బయానంద్ తదితరులు పాల్గొన్నారు.
గెలుపుకోసం కృషి చేయాలి
మొయినాబాద్‌రూరల్: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ గెలుపుకోసమే అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మండలపరిధిలోని అమ్డాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కట్టమైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు గొల్లపల్లి రవీందర్‌రెడ్డి, నోముల అంజిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, మహేందర్ ముదిరాజ్, నారంరెడ్డి, బాత్కు శేఖర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు