ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యుడిగా భాస్కర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యుడిగా భాస్కర్‌

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

సిరిసిల్ల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ జిల్లా సభ్యుడిగా చింతోజు భాస్కర్‌ను నియమించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ చైర్మన్‌గా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఎస్పీ సభ్యులుగా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సెక్రటరీ కన్వీనర్‌గా ఉన్నారు. మరో పదకొండు మంది సభ్యుల్లో సిరిసిల్లకు చెందిన మానేరు స్వచ్చంధ సంస్థ చైర్మన్‌ చింతోజు భాస్కర్‌ను నియమించారు. లోక్‌అదాలత్‌ సభ్యులు, పీసీపీఎన్‌డీటీ సభ్యుడిగా పనిచేస్తున్న భాస్కర్‌ను ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ జిల్లా సభ్యుడిగా నియమించడం విశేషం.

గల్ఫ్‌ ఏజెంట్‌పై

ఎస్పీకి ఫిర్యాదు

జగిత్యాల క్రైం: గల్ఫ్‌ పంపిస్తానని డబ్బులు తీసుకుని జగిత్యాలకు చెందిన గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం చేశాడని బాధితులు మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పట్టణంలో గల్ఫ్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న వ్యక్తి ఐదుగురి నుంచి రూ.2.37లక్షలు తీసుకుని మస్కట్‌ పంపించాడని, అక్కడ పనిలేక వాపస్‌ వచ్చామని, తమకు నష్టం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడిపై విచారణ

జగిత్యాల: కథలాపూర్‌ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. ఓ ఉపాధ్యాయురాలిని వేధించి సస్పెండ్‌ అయిన ఉపాధ్యాయుడిని ఫిర్యాదుల కమిటీ ఆధ్వర్యంలో పోష్‌ యాక్ట్‌ 2013 ప్రకారం మంగళవారం విచారించారు. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. నివేదిక ఆధారంగా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు, ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుల కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అతడిని కమిటీ విచారణ చేపట్టింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు పంపించామని కమిటీ సభ్యులు తెలిపారు.

సిరిసిల్లలో ఇరు వర్గాల ఘర్షణ

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం కొందరు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇరువర్గాల్లోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే జరిగిన ఓ సామాజిక వర్గం ఎన్నికల విభాదాలే ఘర్షణకు కారణమతి ఆరోపణలున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement