వేములవాడ అర్బన్: భీమేశ్వరస్వామి హుండీలలో శ్రావణమాసంలో భక్తులు వేసిన కానుకలను రెండు రోజు లుగా లెక్కిస్తున్నారు. రెండో రోజు గురువారం రూ.1.81 కోట్ల నగదు సమకూరింది. మిశ్రమ బంగారం 81.900 గ్రాములు, మిశ్రమ వెండి 6.800 కిలోలు వచ్చినట్లు ఆలయ అధి కారులు తెలిపారు. ఈవో రమాదేవి, కరీంనగర్ దేవాదాయశాఖ ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఆలయ డీఈవో నవీన్‌కుమార్, పీఆర్వో పెరిక శ్రీనివాస్ లెక్కింపు పర్యవేక్షించారు.
రేపు జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19న సిరిసిల్ల మినీస్టేడియంలో ఎంపిక పో టీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధా న కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపా రు. అండర్ 14, 16, 18, 20 బాలికలు, పురుషులు, మహిళలకు పోటీలు ఉంటాయని వివరించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాల కోరారు. వివరాలకు 79014 64456లో సంప్రదించాలని తెలిపారు.
సామాన్యులకు నాణ్యమైన వైద్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్ర భవనాలు నిర్మించుకొని సామాన్యులకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా వైద్యాధికారిణి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. మండలంలోని సబ్ సెంటర్ భవనాల నిర్మాణ పనులు, విద్యుత్, తాగునీరు, వైద్య సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను గురువారం పరిశీలించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సబ్ సెంటర్ల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యసేవలు మరింత చేరువ చేయాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, మండల వైద్యాధికారిణి సరియా అంజుమ్ పాల్గొన్నారు.


