● అభివృద్ధి.. సంక్షేమ ‘ప్రజాపాలన’ ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ● ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ● హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: ప్రజాపాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయజెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948లో నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటికి 78 ఏళ్లు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు నుంచి స్వతంత్ర భారతావనిలో 60 ఏ ళ్లు అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
రాజన్న ఆలయానికి రూ.390 కోట్లు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు రూ.390 కోట్లతో చేస్తున్నాం. రూ.47.86కోట్లతో రోడ్డు విస్తరణ చేపట్టాం. రూ.111.25 కోట్లతో చేపట్టిన నిత్యాన్నదానం సత్రం పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.12కోట్లతో గుడిచెరువు బండ్ పూర్తి చేశాం. బద్ది పోచమ్మ ఆలయ పనులు తుది దశకు చేరాయి. గుడి చెరువులో బోటింగ్‌కు రూ.1.40కోట్లు మంజూరయ్యాయి. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం పనులు జరుగుతున్నాయి. గోశాల నిర్మాణానికి వేములవాడ మండలం మర్రిపెల్లిలో 40 ఎకరాలు కేటాయించాం.
మహిళలకు రుణాలు
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఇందిరా మహిళాశక్తిలో జిల్లాలోని 1,563 స్వయం సహాయక సంఘాలకు రూ.187 కోట్ల రుణాలు, సీ్త్రనిధిలో రూ.20 కోట్లు అందించాం. జిల్లాలో 1,13,375 మందికి ప్రతీ నెల రూ.24.40 కోట్లు పింఛన్లు అందిస్తున్నాం. రూ.41 కోట్ల సీ్త్రనిధి రుణాలతో 1984 యూని ట్లను గ్రౌండింగ్ చేశాం. ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు 50,745 యూనిఫాంలు కుట్టించి అందించాం. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి జిల్లా సమాఖ్య భవనం నిర్మించాం.
నేతన్నలకు చేతి నిండా పని
వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికులకు చేతి నిండా పని కల్పించేందుకు ఇందిరా మహిళాశక్తి చీరల తయారీకి 6.86 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇచ్చాం. జిల్లాలోని 133 మ్యాక్స్ సంఘాల ద్వారా 6 వేల మంది కార్మికులకు పనికల్పిస్తున్నాం. స్కూల్ యూనిఫామ్స్‌కు 30.31 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశాం. నేతన్నకు పొదుపు పథకంలో 4,963 మంది కార్మికులకు రూ.12.40 కోట్లు వాటాధనం విడుదల చేశాం. వేములవాడలో రూ.50 కోట్లతో యారన్ డిపో ద్వారా 90 శాతం క్రెడిట్‌పై నూలు అందిస్తున్నాం. నేతన్న భద్రతలో 5,864 మంది మరమగ్గాల కార్మికులు, 214 మంది చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాం.
పేదలకు సన్నబియ్యం
జిల్లాలో 5,77,547 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. కొత్తగా 24,643 రేషన్‌కార్డులు అందించాం. రూ.500 గ్యాస్ సిలిండర్‌ను 1,04,058 కుటుంబాలకు అందిస్తున్నాం. రైతుభరోసాలో 1,27,884 మంది ఖాతాల్లో రూ.149.32 కోట్లు జమచేశాం. 46,492 మంది రైతులకు రూ.2లక్షల లోపు పంట రుణాలు రూ.370.75 కోట్లు మాఫీ చేశాం. మర్రిపల్లి వద్ద తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రానికి 40 ఎకరాలు కేటాయించాం.
నీటిపారుదల పనుల్లో పురోగతి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ–2 ఫేస్–1 లో రుద్రంగి చెరువు, మర్రిపల్లి చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులు సాగుతున్నాయి. కెనాల్ నెట్‌వర్క్ ప్యాకేజీ–2 కలికోట సూరమ్మ చెరువు కింద 43,100 ఎకరాల ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల సర్వే పూర్తయింది. భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయి.
పేదింటి కలను నెరవేర్చాం
జిల్లాలో 7,088 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. 3,797 పూర్తయ్యాయి. 2023, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.184.85 కోట్ల విలువైన 457 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. గృహజ్యోతిలో 28.79 లక్షల జీరో కరెంట్ బిల్లులు జారీ అయ్యాయి. రూ.113 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చాం. 1,838 కొత్త వ్యవసాయ కనెక్షన్లు అందించాం.
విద్య, వైద్యం
సిరిసిల్ల, కోనరావుపేటలకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, మూడపల్లి వద్ద రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,948 ప్రసవాలు జరిగాయి. ఆరోగ్యశ్రీలో 4,692 మంది రోగులకు రూ.14.కోట్ల విలువైన ఆపరేషన్లు చేశారు. రుద్రంగిలో రూ. 45.15కోట్లతో ఏటీసీ కేంద్రానికి శ్రీకారం చు ట్టాం. జిల్లాలోని 3,521 మంది సీనియర్ సిటిజన్లకు రూ.2.90కోట్లతో 16,631 సహాయ ఉపకరణాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 16 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు పూర్తి చే శాం. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్‌వో గొట్టె జయశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, శ్రీసెస్‌శ్రీ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చై ర్మన్లు జిందం కళాచక్రపాణి, పుల్కం రాజు, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమా రి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు.


