వేములవాడఅర్బన్: గణేశ్ శోభాయాత్రకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో సమన్వయం చేసుకుని శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరుపై సమీక్షించారు. డయల్–112కు వచ్చే కాల్స్‌పై త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తదితరులు ఉన్నారు.


