వీసా పేరుతో మోసం.. నకిలీ ఏజెంట్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వీసా పేరుతో మోసం.. నకిలీ ఏజెంట్‌ అరెస్ట్‌

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

కోనరావుపేట (వేములవాడ): ఇజ్రాయిల్‌కు పంపిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకొని మోసానికి పాల్పడిన నకిలీ ఏజెంట్‌ను కోనరావుపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన దర్ర మల్లయ్యను కామారెడ్డికి చెందిన బోనగిరి రాజు ఇజ్రాయిల్‌కు పంపిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్న అనంతరం ఇజ్రాయిల్‌కు పంపకుండా మోసం చేయడంతో మల్లయ్య కోనరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాజును పోలీసులు అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి ఒక మొబైల్‌ఫోన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

విదేశాలకు, గల్ఫ్‌ దేశాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామ్మోహన్‌ సూచించారు. సరైన ధ్రువపత్రాలు, అనుమతులు లేని ఏజెంట్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దన్నారు. వీసాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

వేములవాడరూరల్‌: వేములవాడరూరల్‌ మండలం మర్రిపల్లికి చెందిన గొర్రె అవినాశ్‌(22) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అవినాశ్‌ బైండ్ల పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ డబ్బులు వృథాగా ఖర్చు చేస్తుండేవాడని అన్నారు. తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పినప్పటికీ వినకుండా సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎకై ్సజ్‌ అధికారుల దాడులు

ఎల్లారెడ్డిపేట: మండలంలోని అల్మాస్‌ పూర్‌ తండా, గుంటపల్లి చెరువు తండా, కిష్ట నాయక్‌ తండా, అక్కపల్లి తండాలపై ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎకై ్సజ్‌ సీఐ విజయేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో అల్మాస్‌పూర్‌ తండాలో మద్యం విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు లీటర్ల అక్రమ మద్యం, 100 లీటర్ల బెల్లం పానకాన్ని నాటు సారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement