కడుపునొప్పితో భార్యాభర్తల మృతి! | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పితో భార్యాభర్తల మృతి!

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

ఫుడ్‌ పాయిజన్‌గా అనుమానం

మృతురాలు మూడు నెలల గర్భిణి

రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో నివాసం ఉండే దంపతులు అజయ్‌ కుమార్‌ కారే(28) – దినేశ్వరి కారే(25) కడుపునొప్పితో తీవ్రఅస్వస్థతకు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బాలాఘాట్‌ జిల్లా లాంజీ తాలూకా ధర్మార గ్రామానికి చెందిన అజయ్‌కుమార్‌ కారే– దినేశ్వరి కారే భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం సెంటినరీకాలనీకి వలస వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో మేసీ్త్ర పనులు చేసుకుంటున్నారు. ఈనెల 13న రాత్రి సుమారు 9 గంటల సమయంలో భార్యాభర్తలు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 00.30గంటలకు దినేశ్వరికి కడుపునొప్పి రావడంతో భర్తతోపాటు బంధువులకు విషయం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నొప్పి తగ్గుతుందని భావించి నిద్రపోయింది. ఉదయం దినేశ్వరి, అజయ్‌కుమార్‌కు కూడా కడుపునొప్పి రావడంతో ఇద్దరినీ వారి యజమాని రోశయ్య కారులో కమాన్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 14న ఉదయం సుమారు 10.20 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అజయ్‌కుమార్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరోవైపు.. చికిత్స పొందుతున్న దినేశ్వరి కూడా మృతి చెందింది. దీంతో వారికుటుంబ సభ్యులు, స్నేహి తులు విషాదంలో మునిగిపోయారు. అయితే, పోరెన్సిక్‌ నివేదిక తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని మంథని సీఐ స్వామి తెలిపారు. కాగా, దినేశ్వరి ప్రస్తుతం మూడు నెలల గర్భవతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement