అగ్నిప్రమాదాలకు ముందు చూపే మందు | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదాలకు ముందు చూపే మందు

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

● సిరిసిల్ల స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నరేందర్‌

● సిరిసిల్ల స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నరేందర్‌

సిరిసిల్ల: అగ్నిప్రమాదాల నివారణకు ముందు చూపే ముఖ్యమని సిరిసిల్ల స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నరేందర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లోని సురభి సుకృతి అపార్టుమెంట్‌ వద్ద గురువారం అగ్నిమాపకవారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సిరిసిల్ల ఎస్‌ఎఫ్‌వో నరేందర్‌ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. నిప్పుతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. అపార్టుమెంట్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిలిండర్‌ వినియోగం, అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు స్పష్టం చేశారు. లీడింగ్‌ ఫైర్‌ ఫైటర్‌ టి.నర్సింహాచారి, టెక్నికల్‌ ఫైటర్స్‌ గణేశ్‌, అనిల్‌, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement