ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో మరణించడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మనోధైర్యం కల్పించారు. మృతుడు రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజిరెడ్డి మృతి అనంతరం మంత్రి రెండోసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజిరెడ్డి బతికున్న కాలంలో పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మంత్రి ఫోన్‌లో మాట్లాడుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఫోన్‌లో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన మంత్రి


