ప్రార్థనల్లో చిన్నారులు
సిరిసిల్లటౌన్/వేములవాడ/గంభీరావుపేట(సిరిసిల్ల): ముస్లింలు రంజాన్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతపెద్దలు రంజాన్ పవిత్రతను వివరిస్తూ ప్రసంగించారు. శాంతి, సహనం, సోదరభావం వంటి విలువలు పాటించాలని సూచించారు. సిరిసిల్లలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పట్టణా ధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్, మన్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్, టౌన్ సీఐ వీరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక ప్రార్థనల్లో వక్ఫ్‌బోర్డు చైర్మన్
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఈద్గాలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ ప్రార్థనలు చేశారు. ఆలింగనం చేసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.


