ఈవో రమాదేవి
వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 27న నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈనెల 19 నుంచి 27 వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27న సీతారాముల కల్యాణోత్సవం శివార్చన వేదికపై నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదే రోజు సాయంత్రం రథోత్సవం ఉంటుందని వివరించారు. భక్తుల కోసం క్యూలైన్లు, చలివేంద్రాలు, పందిర్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


