భీమన్నను దర్శించుకున్న మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రత ఏర్పాట్లు చేపట్టాలని మల్టీజోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. భీమేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభ కలశంతో స్వాగతం పలికారు. స్వామి వారి మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయ పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ, సిరిసిల్ల డీఎస్పీలు శ్రీనివాస్, నాగేంద్రచారి పాల్గొన్నారు.
పోలీసులకు చట్టాలపై అవగాహన అవసరం
సిరిసిల్ల క్రైం: పోలీసులకు చట్టాలపై అవగాహన ఉండాలని మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ అధికారులతో సమీక్షించారు. కేసుల దర్యాప్తు, నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కఠినతరం చేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతీ వ్యక్తి సురక్షితంగా తిరిగి ఇంటికి చేరే లక్ష్యంతో చేపట్టిన శ్రీఅరైవ్ అలైవ్‌శ్రీ కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, వెంకటేశ్వర్లు, రవి, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


