● కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి..
● వ్యాపారవేత్తగా రాణిస్తున్న సిరిసిల్ల యువకుడు
● వంద మందికి పైగా ఉపాధి ● నేటి యువతకు స్ఫూర్తి పుల్లూరి శ్రీకాంత్
సిరిసిల్ల: ఏం చదివామనేది ముఖ్యం కాదు.. చివరికి ఏ స్థాయిలో ఉన్నామనేదే ప్రధానం. నలుగురు నడిచిన దారిలో వెళ్లడం సాధారణం.. మనమే ఓ దారిని వేసుకెళ్లడం వినూత్నం. ఈ కోవలోకే వస్తారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్. తన పేరుతోనే ఓ కంపెనీని మొదలుపెట్టి ఓ బ్రాండ్‌గా మలచడంలో సక్సెస్ అయ్యారు. వ్యాపార కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చదివారు. సాఫ్ట్‌వేర్ చదివి హార్డ్‌వేర్ వ్యాపారంలోకి దిగారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్‌కే) పేరుతో హైదరాబాద్‌లో కంపెనీని ఏర్పాటు చేసి హోల్‌సేల్‌గా భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇంజినీరింగ్ చదువు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన శ్రీకాంత్.. ప్రస్తుతం వందలాది
మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీఎస్‌కే కంపెనీ వ్యవస్థాపకులు పుల్లూరి శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ.
– వివరాలు 8లో..


