కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్ అందించింది. వ్యాపారం, వ్యవసాయం రంగాలతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూర్చడం హర్షణీయం. అన్ని రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడంతో రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్‌కు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు.
– సంగీతం శ్రీనివాస్,
డీసీసీ అధ్యక్షుడు
మరోసారి మోసం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు రాష్ట్ర ప్రజలను మూడోసారి బడ్జెట్‌లో కూడా మోసం చేసింది. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్లు ఇస్తామన్న ఊసెత్తలేదు. సంక్షేమ పథకాలను విస్మరించారు. కేవలం అంకెల గారడితో నెట్టుకొస్తున్నారు. సీఎం రియల్ వ్యాపారంలా పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన నడుస్తుంది. అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.
– తోట ఆగయ్య,
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
వాస్తవాలకు దూరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది. అప్పులను దాచిపెట్టారు. అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు లేవు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక నిధులు లేక అభివృద్ధి అటకెక్కింది. ఆటో కార్మికులు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, స్కూటీల హామీలకు నిధులేవి. నిరుద్యోగుల గురించి బడ్జెట్‌లో ఒక్క మాట కూడా లేదు.
– రెడ్డబోయిన గోపి,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ప్రజా రంజకమైంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజ కంగా ఉంది. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం హర్షించతగ్గది. కొత్తగా రెండు లక్షల చేయూత ఫింఛన్‌ల మంజూరి సామాన్యులకు ఉపయోగకరంగా ఉంది. విద్యారంగానికి బడ్జెట్‌లో విషేశంగా నిధులు కేటాయించారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయని విధంగా ప్రజా ప్రభుత్వం చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ సమానంగా చూస్తుంది.
– మేడిపల్లి సత్యం,
చొప్పదండి ఎమ్మెల్యే
మొండి చెయ్యి
సర్కారు సబ్బండ వర్గాలకు మొండి చేయి చూపింది. మహాలక్ష్మికి రూ.2500, ఆసరా రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, నిరుద్యోగ భృతికి రూ.4వేలకు నిధులు కేటాయింపులు లేవు. రిటైర్డ్ ఉద్యోగులు, చేనేత కార్మికుల చేయూత లేదు. విద్యార్థినులకు స్కూటీ, మహిళలకు తులం బంగారం అధికారంలోకి రాగానే 100 రోజులలో ఇస్తామని.. మూడో బడ్జెట్లో కూడా మొండి చెయ్యి చూపింది. – అల్లాడి రమేశ్,
సెస్ మాజీ చైర్మన్


