విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

Mar 21 2026 5:17 AM | Updated on Mar 21 2026 5:17 AM

వేములవాడరూరల్‌: వేధింపులపై విద్యార్థినులు నిర్భయంగా షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని షీటీమ్‌ ఏఎస్సై ప్రమీల కోరారు. వేములవాడ రూరల్‌ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్ర వారం అవగాహన కల్పించారు. ఏఎస్సై ప్రమీల మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా షీటీమ్‌ విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్‌, బ్యాడ్‌ టచ్‌, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, పోక్సో చట్టం, షీటీమ్‌ సేవలు, మహిళాచట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు గురైతే నిర్భయంగా షీటీమ్‌కు 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సిబ్బంది రవి, శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement