దళితవర్గాల సాధికారత బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

దళితవర్గాల సాధికారత బడ్జెట్‌

Mar 21 2026 5:17 AM | Updated on Mar 21 2026 5:17 AM

దళితవర్గాల సాధికారత బడ్జెట్‌ బీమాతో ధీమా డ్రాపౌట్స్‌ తగ్గుదల

దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్‌, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్‌ సమగ్రాభివద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్‌.

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంచలన స్కీంను ప్రారంభించింది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల అభివద్ధి, యువత సాధికారత, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సమతుల్యం దిశగా ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది.

– సత్తు మల్లేశ్‌, కరీంనగర్‌ గ్రంథాలయ చైర్మన్‌

అల్పాహారం పథకం పేద,మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వరం, మధ్యాహ్న భోజన పథకానికి ఇది తోడవడంతో డ్రాపౌట్స్‌ మరింత తగ్గుతాయి. ఈ పథకాన్ని ఇంటర్‌ విద్యార్థులకూ వర్తింపజేయడం సాహసోపేతమైన నిర్ణయం. విద్యా కమిషన్‌ సిఫారసులను అమలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు.

– డాక్టర్‌ సూరేపల్లి సుజాత,

విద్యా కమిషన్‌ సభ్యురాలు

విద్యాశాఖకు నిరాశ

విద్యాశాఖకు 8.2 శాతం మాత్రమే నిధులు కేటాయించడం నిరాశను మిగిల్చింది. ఈ బడ్జెట్‌తో విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపించడం అసాధ్యం. కనీసం 20 శాతం బడ్జెట్‌ కేటాయించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ ప్రాధాన్యతను గుర్తించడం లేదు. – దుమాల రమానాథ్‌రెడ్డి,

టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

కార్మిక, కర్షకులకు మోసం

నేతన్నలకు 12 నెలలు పని కల్పిస్తామన్న ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.258 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇవి ఏ మూలకు సరిపోవు. పవర్‌లూమ్‌ కార్మికుల వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. – మూశం రమేశ్‌,

పవర్‌లూమ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement