వేములవాడ: ఈనెల 27న నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో రమాదేవి అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ ముందుచూపుతో వైద్యపరీక్షలు చే యించుకోవడం అన్నింటికీ మంచిదన్నారు. 263 మందికి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పీఎస్ నగర్ పట్టణ ఆ రోగ్య కేంద్రం వైద్యాధికారి సాహితీ, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని స్టార్ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేసింది. అడిషనల్ ఎస్పీతోపాటు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, మండల విద్యాధికారి కృష్ణహరి, సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు సా హెబ్, ఉపాధ్యక్షుడు గౌస్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు.
అభిషేకం.. అర్చనలు
వేములవాడ: రాజన్న ఆలయంలో కొనసాగుతున్న శ్రీసీతారాముల కళ్యాణోత్సవాల్లో భా గంగా రెండో రోజు శుక్రవారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శ్రీసీతారాములకు పంచో పనిషత్తు ద్వారా అభిషేకం, శ్రీరాజరాజేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీలక్ష్మీఅనంత పద్మనాభ స్వామికి అభిషేకం చేశారు.
కవి సమ్మేళనం
సిరిసిల్లటౌన్: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన సిరిసిల్లలోని డే కేర్ సెంటర్‌లో శుక్రవారం కవిసమ్మేళనం నిర్వహించారు. గోశికొండ మురారి పంతులు, వెంగళ లక్ష్మణ్, బూర దేవానందం, బార ధనరాజ్, పద్యాలు ఆలపించారు. సంఘం ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, దొంత దేవదాసు, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీరామరాజు, డాక్టర్ జనపాల శంకరయ్య, జ్ఞానోబా, ధ్యావనపల్లి శ్రీహరి, గజవాడ కైలాసం, మెరుగు లక్ష్మణ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


