మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితా
● సిరిసిల్లలో 81,959, వేములవాడలో 40,877 మంది ఓటర్లు
సిరిసిల్ల/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పోలింగ్‌స్టేషన్‌ల వారీగా తుది ఓటర్ల జాబితాను సోమవారం అధికారులు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉండగా.. 81,959 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942, మహిళలు 42,011 మంది, థర్డ్ జెండ ర్ ఆరుగురు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబి తాపై 47 అభ్యంతరాలు రాగా.. 37 ఫిర్యాదులను మున్సిపల్ సిబ్బంది, మరో 10 దరఖాస్తులను ఈఆర్‌వో పరిష్కరించారు. తుది ఓటర్ల జాబితాను మున్సిపల్ నోటీసుబోర్డుపై, కలెక్టరేట్‌లో, ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీస్‌ల్లో ఉంచామని మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా తెలిపారు. వేములవాడలో 28 వా ర్డులు ఉండగా.. 40,877 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580, మహిళలు 21,279, థర్డ్ జెండర్ ఓటర్లు 18 మంది ఉన్నారని మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తెలిపారు. 117 ఫిర్యాదులు రాగా అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
సిరిసిల్ల క్రైం: ప్యాసింజర్, గూడ్స్ రవాణా వాహనాల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సిబ్బంది సౌమ్య, రమ్య, ప్రశాంత్, ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితా


