కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు సావనపెల్లి రాకేశ్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి మూడో రోజుకు చేరింది. మండలంలోని రోడ్లు బాగుచేయాలని, డిగ్రీ కాలేజీ, మినీస్టేడియం ఏర్పాటు చేయాలని, అసంపూర్తి బ్రిడ్జి పూర్తి చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. రాకేశ్‌కు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు పసుల బాలరాజు, సీపీఐ మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు సావనపల్లి మల్లేశం, గుండ్రేటి రాజు, ఏనుగుల లింగన్న, గడిగే రవి, రామచంద్రం, రాజేశం పాల్గొన్నారు.


