
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
సిరిసిల్లటౌన్: నాగుల పంచమి పూజలు మహిళలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయమే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, పుట్టల్లో పాలు పోశారు. సిరిసిల్లలోని శివసాయిబాబ, అయ్యప్ప ఆలయం, మడేలేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరస్వామి, రేణుక ఎల్లమ్మ, అంబికానగర్, సంతోషిమాత ఆలయాల వద్ద పుట్టల వద్ద నాగదేవతకు పూజలు చేశారు. నాగదేవతకు మొక్కులు తీర్చుకున్న ముత్తైదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో వారం రోజులుగా చేపడుతున్న ముక్కోటి కుంకుమ పూజోత్సవం ముగిసింది. శ్రీచక్ర మహాచండీ యాగం నిర్వహించారు. కుంకుమ పూజల్లో 1,600 మంది సుహాసినులు పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచ విద్యాసాగర్, ప్రయాకరావు మధు, దుబ్బ విశ్వనాథం, కూన సురేష్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి