
‘ముసురు’కుంది
సిరిసిల్లటౌన్: జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచే వాన ముసురుకుంది. అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆవునూరులో 41.5మి.మీ, నేరెళ్ల 38, ఎల్లారెడ్డిపేటలో 35.8, పెద్దలింగాపూర్ 34.8, నామాపూర్ 33.3, గంభీరావుపే ట 26, పెద్దూరు 24.8, గజసింగవరం 23.5, వీర్నపల్లి 19.5, ఇల్లంతకుంట 16, మర్తనపేట 14.8, సి రిసిల్ల 13.5, నిజామాబాద్ 11, కందికట్కూర్ 10.5, మల్లారం 9.8, నాంపల్లి 9, మర్రిగడ్డ 7, రు ద్రంగి 6.8, వట్టెంల 6.3, బోయినపల్లి 5.3, మానా లలో 4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
మత్తుకు దూరంగా ఉండాలి
సిరిసిల్లటౌన్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిరిసిల్ల సబ్ ఇన్‌స్పెక్టర్ వినీతరెడ్డి కోరారు. సెస్ ప్రభుత్వ బాలికల కళాశాలలో డ్రగ్స్ నిరోధంపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఎస్సై వినీతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు తమ చుట్టూ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగించినట్లు, సరఫరా చేసినట్లు గమనిస్తే పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908లో సమాచారం అందించాలని కోరారు. ప్రిన్సిపాల్ వనజకుమారి, కానిస్టేబుల్ వెంకటరమణ, లెక్చరర్స్ మురళీ, సీతారాము, సునీత, శ్రీనివాస్, అప్రోజ్ సుల్తానా, ప్రవీణ్‌కుమార్, నవీన్‌కుమార్ ఉన్నారు.