
మిడ్‌మానేరు కుడికాలువ నీరు వదలండి
ఇల్లంతకుంట(మానకొండూర్): నారుమళ్లు ముదిరిపోతున్నాయని వెంటనే మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని వంతడుపుల, నారెడ్డిపల్లి, గాలిపల్లి, నర్సక్కపేట గ్రామాల రైతులు శుక్రవారం డీఈ రాజును కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. గతేడాది ఈ సమయానికి కుడికాలువ ద్వారా నీరు విడిచారని రైతులు చెప్పారు. నారుమడులు ముదిరిపోతే నష్టపోవాల్సి వస్తుందన్నారు. డీఈ మాట్లాడుతూ డ్యాంలో నీరు అంతగా లేదని వరదనీరు రాగానే మొదటిసారిగా కుడికాలువ ద్వారానే నీటిని వదులుతామని హామీ ఇచ్చారు. రైతులు భాస్కర్‌రెడ్డి, పాశం రవీందర్‌రెడ్డి, చిమ్మనగొట్టు శ్రీనివాస్, మడకడి రవి, మధుసూదన్‌రెడ్డి, రామ్‌రెడ్డి, మిట్టపల్లి మధు పాల్గొన్నారు.