ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌

Jul 20 2025 5:51 AM | Updated on Jul 20 2025 2:29 PM

ప్రైవ

ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన రెండు బస్సులను శనివారం జిల్లా మోటర్‌ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌ సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేవన్న కారణంగా సీజ్‌ చేశారు. టాక్స్‌ సరిగా చెల్లించని ఒక టిప్పర్‌, మరో ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. తనిఖీలో కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, హోమ్‌గార్డ్‌ ఎల్లయ్య పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

వేములవాడరూరల్‌: ఇటీవల విద్యుత్‌ ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ప్రొసీడింగ్‌ కాపీని శనివారం కాంగ్రెస్‌ నాయకులు అందజేశారు. వేములవాడరూరల్‌ మండలం హన్మాజీపేటకు చెందిన గొర్రె మైసయ్య–రాజవ్వ దంపతుల ఇల్లు షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధంకాగా.. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. కాంగ్రెస్‌ గ్రామాధ్యక్షుడు తీగల ఎల్లాగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మ్యాక స్రవంతి, హరినందన్‌రెడ్డి, సోషల్‌మీడియా కన్వీనర్‌ చిలుక ప్రభాకర్‌, జంకె జలంధర్‌, చిలుక భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్చరీలో ఎన్‌ఐఎస్‌కు ఎంపిక

సిరిసిల్లకల్చరల్‌: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌కు జిల్లాలోని నాగారం గ్రామానికి చెందిన బుర్రవేణి హరీశ్‌ ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎస్‌కు 200 మంది మౌఖిక పరీక్షలకు హాజరుకాగా 63వ విభాగంలో 30 మందిని ఎంపిక చేశారు. ఆర్చరీ నుంచి హరీశ్‌ ఎంపికవడం గర్వంగా ఉందని జిల్లా క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్‌ పేర్కొన్నారు. వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్‌రావు, శిక్షకులు గుర్రం సంపత్‌గౌడ్‌, జగన్‌మోహన్‌, ప్రశాంత్‌, కేర్‌టేకర్‌ శ్రీనివాస్‌ అభినందించారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు మొగ్గు చూపాలి

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి(చొప్పదండి): రైతులు ఆయిల్‌పామ్‌ పంటల సాగుకు మొగ్గుచూపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని మర్లపేటలో శనివారం ఆయిల్‌పామ్‌ మొదటి గెలల కోత, కొనుగోలును ప్రారంభించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కొనుగోలు ఒప్పంద పత్రాలను రైతులకు అందజేశారు. ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శేఖర్‌, జిల్లా ఉద్యాన అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఎంఏవో ప్రణీత, ప్రియునిక్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ మల్లేశ్వరరావు, జోనల్‌ మేనేజర్‌ రోహిత్‌, జిల్లా మేనేజర్‌ ప్రేమ్‌సాయి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ తులు తదితరులు పాల్గొన్నారు.

రైతుబీమా ప్రొసీడింగ్స్‌ పంపిణీ

మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన చాడ జైపాల్‌రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన భార్యకు రైతుబీమా కింద మంజూరైన రూ.5లక్షల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే సత్యం అందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కొట్టెపెల్లి సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌యాదవ్‌, వీసీ వినోద్‌రెడ్డి, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌
1
1/2

ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌

ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌
2
2/2

ప్రైవేట్‌స్కూల్‌ బస్సులు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement