పొలంలో వరినాట్లు వేస్తుండ‌గా హఠాత్తుగా.. | - | Sakshi
Sakshi News home page

పొలంలో వరినాట్లు వేస్తుండ‌గా హఠాత్తుగా..

Jan 1 2024 2:04 AM | Updated on Jan 1 2024 1:05 PM

- - Sakshi

వెంకటేశంగౌడ్‌, బుచ్చిమల్లయ్య(ఫైల్‌)

రాజన్న, సిరిసిల్ల: తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సుద్దాల వెంకటేశంగౌడ్‌ (40) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశంకు భార్య స్రవంతి, ఇద్దరు కూతుళ్లు ఉండగా కొన్నేళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నారు. మృతుడికి తల్లిదండ్రులు బాలయ్య, బాలలక్ష్మి, అక్క, తమ్ముడు ఉన్నారు.

పొలంవద్దే ఆగిన రైతు గుండె..
పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన నంద్యాడపు బుచ్చి మల్లయ్య (68) పొలంలో వరినాట్లు వేయిస్తున్నాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. అప్పటి వరకు పొలం పనులు చేస్తూ కళ్లేదుటే బుచ్చిమల్లయ్య మృతిచెదండంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య నర్సవ్వ, కొడుకు తిరుపతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇవి చ‌ద‌వండి: తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండ‌గా.. దూసుకొచ్చిన మృత్యువు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement