దర్శిలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన | - | Sakshi
Sakshi News home page

దర్శిలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

దర్శి: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో తొలిరోజు బుధవారమే దర్శి ప్రాంతానికి చెందిన అధికారుల పచ్చపాతం ప్రదర్శించారు. పట్టణంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముసుగేశారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలు మాత్రం యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. కురిచేడు రోడ్డులో నగర పంచాయతీ నిధులతో నిర్మించిన బస్‌షెల్డర్‌పై టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి ఫొటోలతో ఉన్న డిజిటల్‌ బోర్డులు అలాగే ఉంచారు. గడియారం స్తంభం సెంటర్‌లో ఆమెకు కట్టి ఉన్న ఫ్లెక్సీలను కూడా తీయకుండా అలాగే ఉంచారు. దీనికి తోడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల కోడ్‌కు ముందు ప్రారంభించిన శిలాఫలకానికి కూడా మూత వేయలేదు. పట్టణంలో ఎన్నికల అధికారులు పచ్చనేతల్లా వ్యవహరిస్తున్నారనేందుకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.

మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి ముసుగు

వీధుల్లో యథేచ్ఛగా టీడీపీ ఫ్లెక్సీలు

పచ్చనేతల్లా ప్రవర్తిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement