బ్లడ్‌ బుక్‌ పెట్టి అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

బ్లడ్‌ బుక్‌ పెట్టి అరాచకాలు

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

పంతం నానాజీవి పనికిమాలిన మాటలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ నానాజీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

యర్రగొండపాలెం: చంద్రబాబు తన కుమారుడి చేతిలో రెడ్‌బుక్‌ అనే బ్లడ్‌ బుక్‌ పెట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ, మానభంగాలు, మర్డర్లు చేస్తున్న వారికి మాత్రం ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. ఈ నెల 21న కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి విలేకరులతో మాట్లాడుతూ నానాజీ వ్యాఖ్యలు సంస్కారహీనమైవని, వాటిని కూటమి పార్టీల నాయకులెవరూ ఖండించకపోవడం గర్హనీయమన్నారు. తిన్నది అరక్క అధికారమనే ముసుగు మీ కళ్ల పొరలను కమ్మేసినట్లుందని అన్నారు. నానాజీపై కేసు కట్టాల్సిందిగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ ఇన్‌చార్జిపై ఎవరో ఒక వ్యాఖ్య చేశాడని ఈ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సింగరాయకొండ వెళ్లాడని, అక్కడికి వెళ్లిన ఆయన ఆ వ్యక్తికి నోటీసు ఇచ్చి అతని ఫోన్‌ తీసుకొచ్చాడని, హద్దుమీరి మాట్లాడిన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవాల్సిందేనన్నారు. అయితే ఇది అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఆ విధంగానే నానాజీని కూడా తీసుకొని రావాలని, ఆయనపై కేసు కట్టాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లేకపోయినా చిలకలూరిపేట, గుంటూరులలో జరుగుతున్న పేకాట క్లబ్బులపై మాట్లాడితే తనపై కేసు కట్టారని, ఎవరికో ఇక్కడ మనస్థాపం చెంది కేసు పెట్టాడని ఎమ్మెల్యేపై కేసు కట్టారని, సోమరాజుపల్లెలో ఉన్న వ్యక్తిపై కూడా కేసు కట్టారని అన్నారు. అదే ఉత్సాహం, తెగింపు, అదే బాధ్యత, మీ డ్యూటీని పంతం నానాజీపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. దిగజారి తాము మాట్లాడటంలేదని స్పష్టం చేశారు. చట్టం మీ చుట్టాలుగా మార్చుకొని సామాన్యులను వేధించటానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. నానాజీపై తక్షణమే కేసుకట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని తాటిపర్తి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ వింగ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె వెంకట రమేష్‌, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.ఆదిశేషు, కె.వెంకటేశ్వరరెడ్డి, శేషం రంగబాబు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌కుమార్‌, పి.రాములు నాయక్‌, పోలేపల్లి ఎల్లయ్య, పెద్దకాపు వెంకటరెడ్డి, షేక్‌ వలి, వై.శ్రీనివాసులురెడ్డి, ఆర్‌.అరుణాబాయి, పల్లె సరళ, శార పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement