జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఎన్నిక

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఎన్నిక బీఎల్‌ఏలే ఓటరు ఫారాలు పంచేది

మార్కాపురం: జిల్లాలో బాల్‌ బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా అసోసియేషన్‌ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ సలహాదారుగా ఎంపికై న రిటైర్డు పోస్టుమాస్టర్‌ ఎస్‌డీ సుభానీ తెలిపారు. గౌరవ అధ్యక్షునిగా వైపాలేనికి చెందిన ఎల్‌.వెంకటేశ్వర్లు, అధ్యక్షునిగా మార్కాపురానికి చెందిన ఎస్‌డీ ఖాశిం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జే మోజేష్‌, కార్యదర్శిగా టి. శ్రీనివాసులు, ఆర్థిక కమిటీ కార్యదర్శిగా జి.పద్మనాభరెడ్డి, ఆర్థిక సహాయ కార్యదర్శులుగా కే.వెలుగొండ రాయుడు, పి.నరసింహారావు, సీహెచ్‌ శ్రీనివాసులు, పీ నారాయణ, సీహెచ్‌ రామయ్య, డీ చెన్నకేశవులు, పీ సుబ్బారావు ఎన్నికయ్యారు.

కురిచేడు: బీఎల్‌ఏల ద్వారానే ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయించిన ఘటన కురిచేడులో ఆదివారం జరిగింది. స్థానిక బూత్‌ 64 బీఎల్‌ఓ గుర్రం మౌనిక బీఎల్‌ఏలకు ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చింది. ఆ ఫారాలను కొందరు బీఎల్‌ఏలు వారికి ఇష్టం వచ్చిన చోట కట్టలుగా ఇచ్చి వెళ్లడం ఓటర్లను కంగారుకు గురిచేసింది. తమ ఇంట్లో వాళ్ల ఓటరు ఫారాలు వాకబు చేసుకుని వెళ్లి తెచ్చుకుంటున్నారు. స్థానిక ఓ ఫ్యాన్సీ షాపు యజమాని దేసు మోహనరావు తన కుమార్తెలకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను ఒక కూరగాయల మార్కెట్‌ యజమాని ఇవ్వటంతో విషయం వెలుగు చూసింది. ఆ ఫారాలను తెచ్చుకున్న మోహనరావు దంపతులు బీఎల్‌ఓకు ఫోన్‌ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఫోన్‌ ఎత్తలేదు. ఆ బూత్‌లో కొందరు ఫారాలు పూర్తి చేసి గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి బీఎల్‌ఓ కు ఇచ్చేందుకు ఫోన్‌ చేసినా ఫలితం లేదని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌ చేయగా తనకు ఆరోగ్యం బాగోలేదని, సాయంత్రం ఐదుగంటల వరకు ఉండి బీఎల్‌ఏలకు ఆ ఫారాలు ఇచ్చి వచ్చానని తెలిపారు. ఫారాలు పూర్తి చేసిన వారు సోమ వారం సచివాలయానికి తెచ్చి ఇవ్వమని చెప్పాన ని పేర్కొన్నారు. ఓటర్లు సమాచారం కోసం ఫోన్‌ చేసినా ఫోన్‌ ఎత్తటంలేదని చెబుతున్నారని అడుగగా.. ఫోన్‌ ఆన్‌లో పెట్టుకుని సమాధానం చెప్పాలా? అంటూ ప్రశ్నించటం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement