ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ హౌస్ మ్యాపింగ్‌లో అన్యాయం జరిగింది. నా పేరు సాల్వ వెంకటేశ్వర్లు మాది గొట్టిపడియ గ్రామం. అక్కడ 47 సంత్సరాల నుంచి నివసిస్తున్నాను. మాకు అన్ని అధారాలు ఉన్నా పునరావాస ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదు. హౌస్ మ్యాపింగ్‌లో కొత్త ఇల్లు అని పడిందని అధికారులు చెప్పారు. న్యాయం చేయాలని కోరుతున్నాం.
– సాల్వ వెంకటేశ్వర్లు, గొట్టిపడియ గ్రామం.
ప్యాకేజీలో అన్యాయం
నా పేరు కొర్రపోలు పేతురు. గొట్టిపడియలో 40 ఏళ్ల నుంచి నివసిస్తున్నాను. మాకు అన్ని ఆధారాలు ఉన్నా ప్యాకేజీ లిస్టులో పేరు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్న ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదు.
– కొర్రపోలు పేతురు, గొట్టిపడియ గ్రామం.


