గ్రామంలో కొత్త ఇల్లు కింద హౌస్ మ్యాపింగ్ అయిన బాధితులకు న్యాయం చేయాలి. పూర్వం నుంచి గ్రామంలో నివసిస్తున్నా, గజిట్‌లో పేర్లు ఉన్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. బాధితులు కూలి పనుల కోసం వలసగా వేరే ఊరికి వెళ్లిన 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊరి నివాసులైన వారికి ఆధారాలు ఉన్నా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో అన్యాయం జరిగింది. అధికారులు బాధితులకు న్యాయం చేయాలి.
– నల్లబోతుల కొండయ్య, రాష్ట వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, గొట్టిపడియ
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లిస్టులో పేరులేదు
నా పేరు కొమ్మతొటి బాబు. మాది గొట్టిపడియ గ్రామం. 56 ఏళ్ల నుంచి ఉంటున్నా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదు.
– కొమ్మతోటి బాబు, గొట్టిపడియ గ్రామం.


